ఆర్థిక సహాయం అందజేత
On
విశ్వంభర, నాగారం: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామం లో ఇటీవల అనారోగ్యంతో కాసరబోయిన లక్ష్మమ్మ మృతిచెందింది.ఆమె కుటుంబ సభ్యులకు గ్రామ యువకులు 4500 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబానికి యువత అన్ని సమయాల లో అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కన్నెబోయిన రమేష్, సంకటి ఎల్లేష్,కన్నెబోయిన లింగమల్లు, కొలిపాక సాయికుమార్, కన్నెబోయిన మధు, మంగదుడ్ల నరేష్, కన్నెబోయిన శేఖర్, గొండ్ర సైదులు, కన్నెబోయిన మధు, తదితరులు పాల్గొన్నారు.



