అండర్ డ్రైనేజ్ పనులు  ప్రారంభం

అండర్ డ్రైనేజ్ పనులు  ప్రారంభం

విశ్వంభర, మొయినాబాద్: మొయినాబాద్ మండలంలోని బాకారం జాగీర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని గ్రామ సర్పంచ్ ఎల్గని వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఆదివారం బాకారం జాగీర్ గ్రామపంచాయతీ పరిధిలోని 8వ వార్డులో ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి అండర్ డ్రైనేజ్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ,  గ్రామ ప్రజల సహకారంతో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వ్యవస్థ, ఇతర అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రజలతో కలిసి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుభాష్ చంద్రబోస్ రెడ్డి, వార్డు సభ్యులు కొంతం నాగేశ్వర్ రెడ్డి, రాధిక రాఘవ రెడ్డి, ఉమారాణి బిక్షపతి గౌడ్, బంధి అనిల్ కుమార్, ఉపేందర్ యాదవ్, కొండకల్ల రవి, కొండకల్ల అమృత ఎల్లయ్య, కొండకల్ల స్వాతి మహేందర్, దినేష్ రెడ్డి, నాయకులు కొండకల్ల శ్రీకాంత్, రాజేందర్ రెడ్డి, సారా రవి, వడ్డే శివ, బంటు నరసింహ, గ్రామపంచాయతీ సిబ్బంది మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags: