ఘనంగా పూలే , అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ
విశ్వంభర, నిజామాబాద్: డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే , అంబేద్కర్ విగ్రహాల ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్యఅతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ మహాత్ముల విగ్రహాలను గ్రామంలో ప్రతిష్టించుకుంటే మహాత్ముల భావజాలలో మదిలో మెదులుతాయని అన్నారు. మహాత్ములను ఆదర్శంగా తీసుకొని తన జీవన సరళిని మరల్చుకోవాలని అన్నారు. మహాత్ముల అడుగుజాడల్లో నడవాలని ఆయన కోరారు. బర్దిపూర్ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని, ఇండ్ల స్థలాలు లేనివారికి 70 గజాల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం దళిత సంఘ నాయకులు డాక్టర్ భూపతిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోట్ల భాస్కర్, మహాత్మ జ్యోతిరావు ఫులే, అంబేద్కర్ సంఘం బర్దిపూర్ అధ్యక్షులు జెల్ల బాబు, ఉపాధ్యక్షుడు జాంపండ్ల నర్సయ్య, క్యాషియర్ జాంపండ్ల సాయిలు, కార్యదర్శి దాసరి చందు, గ్రామ విగ్రహ దాత కోట్ల భాస్కర్, మరో విగ్రహ దాత ఎయ్య జమున శివ కృష్ణ, ఉప సర్పంచ్ తోట మహేష్, గద్దె దాత నీ రెడీ పద్మారావు , వార్డు సభ్యుడు గంధం భాస్కర్, నీ రెడీ దేవరాజ్, మేక కిష్టా రెడ్డి, ముచ్చుపాలు, సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు గొట్టిపాటి వాసు, ఆరేపల్లి సర్పంచ్ పెంటాజి, మాజీ సర్పంచ్ ఈగ నారాయణరెడ్డి, సామ్సన్, ఎడ్ల ఆనంద్, ధర్మ గౌడ్, న్యాసం రాజేశ్వర్, కొన్నే మహేష్ గ్రామ దళిత సంఘ సభ్యులు గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.



