బిఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయకులు

బిఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయకులు

విశ్వంభర,  హనుమకొండ: దామెర మండలం దుర్గంపేట గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు పౌడల కుమారస్వామి, ఆ పార్టీకి రాజీనామా చేసి పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి  ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా బిఆర్ఎస్ నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. ఈ చేరికతో దుర్గంపేట గ్రామంలో బిఆర్ఎస్ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు, యూత్ నాయకులు,  తదితరులు పాల్గొన్నారు.

Tags: