హరిబౌలి అభివృద్ధిపై చర్చ
On
విశ్వంభర, కార్వాన్ : జాగృతి నాయకులు సోను భాయ్, ఆయన బృందం సీనియర్ నాయకుడు రామిడి వెంకట్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హరి బౌలి డివిజన్‌లో చేపడుతున్న బస్తీ బాట కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించే విధానం పై చర్చించారు. డివిజన్‌లో మౌలిక వసతుల మెరుగుదల, పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి అంశాలపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలను సోను భాయ్ వివరించారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం పెంచుకుంటూ వారి అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు కొనసాగించాలని రామిడి వెంకట్ రెడ్డి సూచించారు. యువ నాయకులు సేవాభావంతో ముందుకు రావాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రాకేష్ గైక్వాడ్ , హర్ష ఆస్థాన, ఓంకార్ స్వామి, రాజ్ కుమార్, నరేంద్ర శ్రీవాస్తవ, గురు రాజ్, తదితరులు పాల్గొన్నారు.



