ఆలయంలో ఎమ్మెల్యే జీఎంఆర్ పూజలు
On
విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, జాతర కార్యక్రమాల్లో పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకటరెడ్డి, శ్రీశైలం, గోపాల్, సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



