ప్రతి ఒక్కరు ఓటును సద్వినియోగం చేసుకోవాలి
- శాసనసభ సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని 44 వ వార్డు సిద్దార్థ హైస్కూల్ పోలింగ్ కేంద్రం 154 లో మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, బండారు రాజా, చల్లా లక్ష్మీకాంత్ మాట్లాడుతూ , ఓటు హక్కును ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఐదు సంవత్సరాల మున్సిపల్ భావితవ్యాన్ని నిర్ణయించే ఎన్నిక ఇదని పేర్కొన్నారు. ప్రజలందరూ విధిగా పోలింగ్ లో పాల్గొనాలని, వార్డుల అభివృద్ధి మౌలిక సదుపాయాలు కలిపించుకునే ఎన్నిక ను ఓటర్లు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ బీఆర్ఎస్ తమ ఫోన్లు టాపింగ్ చేస్తున్నారన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ది దద్దమ్మ ప్రభుత్వమని మంత్రి పొంగులేటే ఒప్పుకున్నడు, అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా, బిఆర్ఎస్సా అన్న సోయికూడా లేదు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మంత్రుల ఫోన్లు టాప్ చేస్తున్నారనడం సిగ్గుచేటని అన్నారు. పోలీసింగ్ లేని చేతగాని ప్రభుత్వమని మంత్రుల మాటల్లో తేటతెల్లమయిందని, కాంగ్రెస్ హోమ్ మంత్రి చేతకానివాడని వాళ్లే నిర్ధారిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రుల ఫోన్లు కూడా టాప్ చేస్తున్నారని మొదటి నుండి బీఆర్ఎస్ చెబుతోంది, పోలీస్ వ్యవస్థ ను అడ్డంపెట్టి బీఆర్ఎస్ పై దాడులు చేస్తున్నారన్నారు. పోలీసులు, అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారన్నారు. మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నది ముఖ్యమంత్రేనని ఆరోపించారు. సీఎం స్థాయిలో అధికారులను పార్టీకి సహకరించాలనడం దూర్మార్గమని, ఎన్నికల్లో సహకరించాలని సీఎం ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ పెట్టడం సిగ్గుచేటని, దీంతో వాళ్లకు ఓటమి భయంపట్టుకున్నదని మరొమారు రుజువైందని పేర్కొన్నారు. నేరాలను అదుపుచేయడంలో పూర్తిగా విఫలమయిండ్రు, రాత్రులు కాంగ్రెస్ గుండాలు బైక్ లపై హల్చల్ చేస్తూప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుండ్రు, ఏదారి లేకనే ఓట్లేంచమని ఉద్యోగుల కాళ్ల బేరానికి వెళ్లిండు, ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయేది కేసీఆర్ రాజ్యమేనాని ధీమా వ్యక్తం చేశారు.



