రోడ్డు విస్తరణ బాధితులను ఆదుకోవాలి 

రోడ్డు విస్తరణ బాధితులను ఆదుకోవాలి 

  •  ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్

విశ్వంభర, విశాఖపట్నం: విశాఖపట్నం నగరంలోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గోపాలపట్నం ప్రాంతంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేసే పరిస్థితి ఏర్పడటంపై ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. కుమారి కళ్యాణ మండపం నుండి ఇంద్రనగర్, లక్ష్మీనగర్, అల్లూరి సీతారామరాజు నగర్ మీదుగా వంటిల్లు జంక్షన్ వరకు, వార్డు నెంబర్లు 90, 91, 92 పరిధిలో సుమారు 1970 నుంచి నివసిస్తున్న కుటుంబాలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారనే సమాచారంతో, బాధిత ప్రజల తరఫున ఫోకస్ హ్యూమన్ రైట్స్ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న ఫోకస్ హ్యూమన్ రైట్స్ ఫౌండర్  చైర్మన్ ఆనంద రావు ఈ అంశంపై తక్షణమే స్పందించి, జీవీఎంసీ ప్రధాన కమిషనర్ కేతన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆనంద రావు మాట్లాడుతూ, రోడ్లు అవసరమే కానీ ప్రజల ఇళ్లు కూల్చి వేసి చేసే అభివృద్ధి అసలు అభివృద్ధే కాదు అన్నారు. ప్రజల హక్కులు పరిరక్షించకుండా జరిగే ఏ చర్యనైనా ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అడ్డుకుంటుందని చెప్పారు. ఫోకస్ హ్యూమన్ రైట్స్ విశాఖ జిల్లా ప్రెసిడెంట్  గుడాల జగన్నాథరావు ఆధ్వర్యంలో సుమారు 30 మంది బాధితులతో కలిసి  జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి కమిషనర్ కేతన్ వర్మ ని  కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా  గుడాల జగన్నాథరావు  మాట్లాడుతూ, ఫైళ్లలో కాకుండా ప్రజల సమస్యలను నేరుగా అధికారుల టేబుల్ మీద పెట్టడమే మా పని అని అన్నారు. ఫోకస్ హ్యూమన్ రైట్స్ ఫంక్షన్ ప్రతినిధుల వినతిపై స్పందించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ వర్మ ఈ అంశంపై లోతైన విచారణ జరిపిస్తామని, ప్రజలకు అన్యాయం జరగకుండా అన్ని కోణాల్లో పరిశీలించి చర్యలు తీసుకుంటామని   హామీ ఇచ్చారు.

Tags: