హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
- మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శ
విశ్వంభర, హైదరాబాద్: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ 7వ తరగతి విద్యార్ధి ఉమేష్ ఆత్మహత్యయత్నానికి పాల్పడగా.. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్ నెస్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొన వెల్ నెస్ హాస్పిటల్ కు వచ్చి విద్యార్ధిని పరామర్శించారు. విద్యార్థికి అందుతున్న చికిత్సను డాక్టర్లను అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. విద్యార్ధి ఆరోగ్యం మెరుగుపడే వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని మంత్రి తెలిపారు. చికిత్స విషయంలో ఎలాంటి వెనకడుకు వేయవద్దని వైద్యులకు సూచించారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితో మంత్రి వాకిటి శ్రీహరి ఫోన్లో మాట్లాడి ఈ ఘటనపై విచారణ చేయాలని ఆదేశించారు. విద్యార్ధి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. మంత్రి వెంట స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి, ఇతర అధికారులు ఉన్నారు.



