దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు
విశ్వంభర, చింతపల్లి: మత సామరస్యానికి ప్రతీక హజ్రత్ అబ్బాస్ దర్గా షరీఫ్ అని దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ అన్నారు. ఆదివారం చింతపల్లి మండలంలోని పీకే మల్లేపల్లి గ్రామంలో ఉన్న హాజ్రత్ అబ్బాస్ దర్గా షరీఫ్ ఉర్సు కార్యక్రమంలో పాల్గొన్నారు. గంధాన్ని సమర్పించారు. దర్గా ముత్తావలి మహమ్మద్ చాంద్ పాషా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల రఘుమారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముచ్చర్ల యాదగిరి, టిపిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల వెంకటయ్య గౌడ్, మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, మాజీ జెడ్పిటిసి హరినాయక్, సర్పంచులు కాసారపు శ్వేతా శ్రీనివాస్, ఉజ్జీని హేమలత నరేందర్ రావు తంగెళ్ల రామకృష్ణ, యాచారం యాదిగౌడ్, కాయితి జితేందర్ రెడ్డి, ఎలిమినేటి నరసింహ, గుణమోని కొండల్, సయ్యద్ పాషా, దర్గా కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



