కాంగ్రెస్ పార్టీలో చేరిక 

కాంగ్రెస్ పార్టీలో చేరిక 

విశ్వంభర, మహేశ్వరం :   వచ్చే ఎంపీటీసీ,జడ్పీటీసీ, జీహెచ్ఎంసీ  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ   తిరుగులేని విజయం సాధిస్తుందని  మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో కందుకూరు సీనియర్ నాయకులు, తెలంగాణ జాగృతి ఇన్ఛార్జి అందుగుల సత్యనారాయణ సహా పలువురు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా కె.ఎల్.ఆర్  మాట్లాడుతూ, కార్యకర్తలే పార్టీకి  బలం, సీఎం రేవంత్ రెడ్డి  నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చిందని తెలిపారు, పార్టీని వీడిన నాయకులు మళ్లీ కాంగ్రెస్ లో చేరటం సంతోషమన్నారు. అందుగుల సత్యనారాయణ సహా మహిళలు, యువకులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కె ఎల్ ఆర్  హామీ ఇచ్చారు. పంచాయతీలు, పట్టణాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. గ్రామంలో ప్రతి కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ నాయకులకే పట్టం కట్టాలని లక్ష్మారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి.

Tags: