23న కలెక్టరేట్ ముందు ధర్నా
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల కార్మికులందరూ ఈ నెల 23న కలెక్టర్ ఆఫీస్ ముందు నిర్వహించే ధర్నాలో పాల్గొనాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సి.ఐ.టీ.యు) జిల్లా ప్రధాన కార్యదర్శి నకరేకంటి రాము కోరారు. రామన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, 51 జిఓ రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్ లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షల ఇన్సూరెన్స్, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఆన్ లైన్ నమోదు కాని కార్మికుల పేర్లను ఆన్ లైన్ లో నమోదు చేయాలని, మరణించిన కార్మికుని దహన సంస్కారాలకు 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ నాయకులు బొడ్డు సాలయ్య, గాదె చంద్రయ్య, మంటి నాగరాజు, నకరికంటి పరశురాములు, బాచుపల్లి సైదులు, కే.వెంకటేశ, మేడి రామచంద్రం, నాగ స్వామి, నారపాక అండాలు తదితరులు పాల్గొన్నారు.



