శతాధిక వృద్ధురాలి మృతి  

శతాధిక వృద్ధురాలి మృతి  

విశ్వంభర, మహబూబాబాద్:  మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున  రామరాజు శాంతమ్మ(102) తన నివాసంలో మరణించిందని  కుటుంబ సభ్యులు తెలిపారు . శనిగాపురం  గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులందరికీ ఆమెతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు . మృతురాలికి  ఎనిమిది మంది కొడుకులు ,బిడ్డలు, మనుమలు మనుమరాండ్లు వున్నారు.  శనిగపురం గ్రామ మాజీ సర్పంచ్ రామరాజు భిక్షపతి, 9వ వార్డు కౌన్సిలర్ కందుకూరి సుధామోహన్, పిఏసీఎస్ మహబూబాబాద్ మాజీ డైరెక్టర్ నాయిని రంజిత్, రాష్ట్ర బిసి సంఘ నాయకులు శంతన్ రామరాజు, శనిగపురం మాజీ సర్పంచ్ గుగులోత్ రాజునాయక్, మున్నూరుకాపు సంఘం నాయకులు రామరాజు జనార్దన్, వేల్పుల విష్ణు, తోట సురేష్, పడాల దేవయ్య, పద్మం చంద్రయ్య నివాళులు అర్పించారు.

Tags: