కల్నల్  సంతోష్ బాబు తల్లిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. -మంజుల గెలుపు కై ఇంటింటి ప్రచారం. 

మాజీ మంత్రి , సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి.

కల్నల్  సంతోష్ బాబు తల్లిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. -మంజుల గెలుపు కై ఇంటింటి ప్రచారం. 

విశ్వంభర, సూర్యాపేట :-సూర్యాపేట మున్సిపాలిటీ 44వ వార్డ్ లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కల్నల్ సంతోష్ బాబు తల్లి  బిక్కుమల్ల మంజుల ఉపేందర్ ను గెలిపించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం 44వ వార్డులో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం సంతోష్ బాబు ప్రాణాలు అర్పించిన సమయంలో ఆయన గొప్పతనాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి వారికి తగిన గౌరవంతో పాటు వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందని గుర్తుకు చేశారు. రాజకీయాలకతీతంగా  మంజుల ఉపేందర్ ని ఏకగ్రీవం   చేద్దామని అన్ని పార్టీలతో మాట్లాడిన  వారు స్పందించకపోవడం దారుణమని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబానికి గౌరవం ఇవ్వాల్సింది పోయి, ఆయా పార్టీలు బరిలోకి దింపడం సిగ్గు చేటు అన్నారు. 2014 ముందు సూర్యాపేట లో మంచినీటి, వీధి దీపాల నిర్వహణ, రోడ్లు, మురికి కాల్వ ల నిర్వహణ లేక దోమలతో సూర్యాపేట ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారని అన్నారు. 2014 తర్వాత సూర్యాపేట మున్సిపాలిటీలో ఇలాంటి సమస్య లేకుండా అంతర్గత రహదారులు, మంచినీటి, మురికి కాల్వ నిర్వహణ లాంటి సమస్యలను లేకుండా రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దానని తెలిపారు. ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు 2014 ముందు సమస్యలను చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలని ఊదరగొట్టి, ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బూతు పురాణం ఎత్తుకుంటున్నాడని అన్నారు. రైతుబంధు కెసిఆర్ హయాంలో సమయానికి రైతుల ఎకౌంట్లో జమ అయ్యేదని, రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత మూడుసార్లు రైతు భరోసా నిధులు ఎగ్గొట్టాడని గుర్తుకు చేశారు. అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. అనంతరం వైశ్య వికాస వేదిక చైర్మన్ డా. కాచం సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ సూర్యాపేట అభివృద్ధిలో కల్నల్ సంతోష్ బాబు తల్లి బిక్కుమల్ల మంజుల ఉపేందర్ కీలక భూమిక పోషించాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా సంతోష్ బాబు తల్లి మంజులకి టికెట్ కేటాయించి మరోసారి గొప్ప ఔవునత్యాన్ని చాటుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన, బూతు పురాణం నడుస్తుందని అన్నారు. దేశం కోసం ధర్మం కోసం అని పొద్దున్నే లేస్తే నీతి పురాణాలు వెలించే బిజెపి సైతం మంజులపై పోటీని పెట్టడం దుర్మార్గమని అన్నారు. సూర్యాపేట మరింత ప్రగతి పదములు నడిపించాలంటే జగదీశ్వర్ రెడ్డి నాయకత్వం ఎంత అవసరమని, ఆయన బలపరిచిన మంజుల ఉపేందర్ ను భారీ మెజార్టీతో గెలిపిద్దామని పిలుపునిచ్చారు. మాజి సైనిక ఉద్యోగులు అందరు కలిసి మద్దతు తెలిపితే ఎందుకు రావడం ఎంతో ఆనందించదగ్గ విషయమని తెలిపారు.

Tags:  

Advertisement

LatestNews