వైభవంగా శివపార్వతుల కల్యాణం
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పూజలు
విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలో నిర్వహించిన శివపార్వతుల కల్యాణ మహోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జిన్నారం మాజీ జెడ్పీటీసీ కొలన్ బాల్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే మహోత్సవమని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, భక్తి భావాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్దన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, సురేందర్ గౌడ్, నూతన కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



