ఘనంగా లచ్చమ్మ తల్లి బోనాలు 

ఘనంగా లచ్చమ్మ తల్లి బోనాలు 

విశ్వంభర, నెల్లికుదురు: మానుకోట జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో మహిమాన్విత సవార్ లచ్చమ్మ తల్లికి సర్పంచి మాదరి ప్రశాంత్  భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు.  ఈ సందర్భంగా సర్పంచ్ అమ్మవారి ఆలయంలో లచ్చమ్మ తల్లి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు డప్పు చప్పుళ్ల హోరు, శివశక్తుల పూనకాల మధ్య మహిళలు బోనాలతో  సవార్ లచ్చమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఇంటిల్లిపాది బోనం నైవేద్యాలను, పూజా ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించుకుని మొక్కు లు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామగిరి సుమన్, మాజీ వార్డు మెంబర్లు అరపెల్లి రాంచంద్రు, బందు రాములు, అరపెల్లి శ్రీనివాస్, ఎడ్ల వెంకన్న, బిరెల్లి శివ, బందు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Tags: