ఎట్టకేలకు రహదారి నిర్మాణం
On
విశ్వంభర, రాప్తాడు: రాప్తాడు మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో ఎట్టకేలకు రహదారి నిర్మాణం పూర్తయింది. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రచారానికి వచ్చినప్పుడు గ్రామస్తులు రోడ్ సమస్యను దృష్టికి తెచ్చారు. కచ్చితంగా రోడ్డు నిర్మాణం చేపడతామని మాట ఇచ్చారు.
ఆదివారం అయ్యవారిపల్లి గ్రామంలో సిసి రోడ్డు పూర్తి చేశారు. గ్రామస్తులు ఎమ్మెల్యే పరిటాల సునీతకు కృతజ్ఞతలు తెతెలిపారు.



