అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు: కేఎల్ఆర్
On
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కేఎల్ఆర్ అన్నారు .
అమీర్పేట్ లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు చాలా బాగా ఉన్నాయని, ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల కల నెరవేరిందని అన్నారు. గ్రామస్తులు నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఇంద్రమ్మ కమిటీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.



