వైభవంగా మల్లన్నస్వామి రథోత్సవం 

వైభవంగా మల్లన్నస్వామి రథోత్సవం 

విశ్వంభర, చింతపల్లి: మండల పరిధిలోని నెల్వలపల్లి గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. రథోత్సవ కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ హాజరై స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అంగీరేకుల నాగభూషణం, టిపిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల వెంకటయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు నల్ల రఘుమారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముచ్చర్ల యాదగిరి, మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, మాజీ జెడ్పిటిసి హరినాయక్, సర్పంచులు ఆవుల మహేశ్వరి మల్లయ్య, కాసారపు శ్వేతా శ్రీనివాస్, ఉజ్జీని హేమలత నరేందర్ రావు తంగెళ్ల రామకృష్ణ, యాచారం యాదిగౌడ్, కాయితి జితేందర్ రెడ్డి, గున్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,ఎలిమినేటి నరసింహ, గుణమోని కొండల్, ఉప సర్పంచ్ బండ్ల నాగయ్య, వినోద్ గౌడ్, మాస భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: