ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం 

ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం 

  విశ్వంభర, మహబూబాబాద్:  ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మహబూబాబాద్ కేంద్రంలో బాలాజీ గార్డెన్స్ లో మహబూబాబాద్ జిల్లా ఎన్ హెచ్ ఎం జేఏసీ ప్రారంభోత్సవం, ఎన్నుకోబడిన నాయకుల ప్రమాణ స్వీకార మహోత్సవము, ఎ,న్ హెచ్ ఎం మహబూబాబాద్ జిల్లా ఉద్యోగుల క్యాలెండర్, స్టిక్కర్ ఆవిష్కరణకు   ముఖ్య అతిథిగా సమ్మిగౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన  మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ  ఇచ్చారు.   గత 6 నెలల నుండి జీతాలు లేక ఇబ్బందుల పడుతున్న ఎస్ ఎన్ సియు కాంటిజెంట్ వర్కర్ల బాధలు తెలుసుకొని నలుగురు  వర్కర్స్ కు నెలకు సరిపడా సామాన్లు అందజేస్తా అని చెప్పారు. ఎన్ హెచ్ ఎం వ్యవస్థాపకుడు పుట్ట మహేందర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి రాకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని అన్నారు.   మహబూబాబాద్ జిల్లా కోర్ కమిటీ 48 సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.  జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ కుమార్ డుంగ్రోతు, ప్రధాన కార్యదర్శిగా పొన్నం కవిత, కోశాధికారిగా పగిడిపల్లి ఉమాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా డాక్టర్ కందుల నాగరాజు, వైస్ ప్రెసిడెంట్గా డాక్టర్ పి శ్రీకాంత్ తదితరులను  నియమించారు. డాక్టర్ కుమార్  డుంగ్రోతు మాట్లాడుతూ  ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు.  ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు  రుక్ముద్దీన్ , డాక్టర్  కె.నవీన్ కుమార్ ,  రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మొగిలి నరేష్ , మహబూబాబాద్ జిల్లా  రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు రాజ్ కుమార్,నవీన్,జ్యోతి ,అశ్విని,  ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags: