పరిసరాల శుభ్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత
- మున్సిపల్ ఛైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది
విశ్వంభర, సూర్యాపేట: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని మున్సిపల్ ఛైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. హారదేవ్ సింగ్ జీ మహరాజ్ జయంతి సందర్భంగా నిరంకారి మిషన్, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ అమృత్‌లో భాగంగా ఆదివారం స్థానిక మినీ ట్యాంక్‌బండ్ వద్ద ‘స్వచ్ జల్–స్వచ్ మాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాగునీరు స్వచ్ఛంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు పాటుపడాలని కోరారు. స్వచ్ జల్, స్వచ్ మాన్ వంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు.సమాజంలో ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరం అని చెప్పారు. యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే రోజు నిరంకారి మిషన్ సేవా కార్యక్రమాలు చేపట్టడం విశేషం అని పేర్కొన్నారు. సూర్యాపేట సంయోజక్ కె. సరళ మాట్లాడుతూ మహరాజ్ చూపిన మార్గంలో నడవాలని అన్నారు. ప్రాజెక్ట్ అమృత్ ద్వారా నీటి వనరుల పరిరక్షణకు కృషి చేస్తున్నాం అని తెలిపారు. ఈ సందర్భంగా సద్దుల చెరువు కట్ట పై చెత్త, చెదారం తొలగించారు. ఈ కార్యక్రమంలో 29వ వార్డు కౌన్సిలర్ రాపర్తి భవాని శ్రీనివాస్, ఎన్విర్వాల్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, జవాన్ వేణు, నర్సింహారెడ్డి,ఎం. విద్యాసాగర్, కె. లక్ష్మారెడ్డి, హరీశ్, రాజేశ్, అంజలి, రవి, లక్ష్మీ, నిర్మల, వెంకటేశ్వర్లు, సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.



