రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

  • జిల్లా ఎస్పీ నరసింహ 

 విశ్వంభర,సూర్యాపేట:  ప్రజల ప్రాణ భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని సోమవారం నుంచి జిల్లాలో వారం రోజుల పాటు రెండవ దశ “అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన'' కార్యక్రమం నిర్వహించనున్నట్లు  జిల్లా ఎస్పి నరసింహ తెలిపారు.  రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యం చేరడం, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. ఈ మేరకు సిబ్బందికి ఆదేశాలు, ప్రణాళిక జారీ చేశమన్నారు. ''జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత ప్రచారం చేస్తాము. ప్రజలకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై ప్రకటనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.  హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, మితిమీరిన వేగం నివారణ, మద్యం తాగి వాహనం నడపకూడదనే అంశాలపై ప్రతి రోజు ఒక కార్యక్రమం నిర్వహించి.. ప్రజలను, విద్యార్థులను, యువతను, డ్రైవర్ లను చైతన్య కలిగిస్తాం'' అనే  ఎస్పీ నరసింహ  అన్నారు.

Tags: