వైభవంగా దుర్గాదేవి మహా హోమం
On
విశ్వంభర, శంకర్పల్లి: శంకర్పల్లి మండలం కొత్తగూడెం గ్రామ శివారులోని శ్రీ పాతాళ త్రికోణ మహా సుందరి మహంకాళి ఆలయంలో ఆదివారం వైభవంగా 108 మహా గుండాలతో దుర్గాదేవి మహా హోమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ డిటెక్షన్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్ శ్రీ నాగ మూర్తి శర్మ, తదితరులు పాల్గొన్నారు.



