తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం అధికారులు విడుదల
On
విశ్వంభర, హైదరాబాద్:- బ్యూరో: తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7మున్సిపల్ కార్పొరేష్లకు సాధారణ ఎన్నికల నిర్వహణకు మంగళవారం మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ ఎస్ఈసీ రాణి కౌముదిని నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఎలక్షన్స్కు సంబంధించి అభ్యర్థులు రేపటి నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ కొనసాగనుందని తెలిపారు. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించి ఫిబ్రవరి 13న ఓట్లను లెక్కించనున్నారు. ఎక్కడైనా రీపోలింగ్ చేయాల్సి ఉంటే 12న నిర్వహిస్తామని ఈసీ పేర్కొంది.



