సైన్స్ పై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలి 

సైన్స్ పై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలి 

విశ్వంభర,  చింతపల్లి : విద్యార్థులు సైన్స్ సబ్జెక్టు పట్ల  ఆసక్తిని పెంచుకోవాలని జెడ్పిహెచ్ఎస్ చింతపల్లి  ఇంన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు సపావత్  కిషన్ లాల్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతపల్లిలో ఫోరమ్ ఫర్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి భౌతిక రసాయన శాస్త్ర టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాలను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ఈ పోటీ ప్రపంచంలో ప్రతిభా పరీక్షలు విద్యార్థుల నైపుణ్యాన్ని అంచనా వేయడానికి ఎంతగానో తోడ్పడతాయని, విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తే తప్పకుండా విజయం సాధించగలరన్నారు. ఫిజికల్ సైన్స్ మండల స్థాయి టాలెంట్ టెస్టులో ప్రథమ ర్యాంక్ సాధించిన జెడ్పిహెచ్ఎస్ కుర్మపల్లి పదవ తరగతి విద్యార్థి వారాల చరణ్, ద్వితీయ ర్యాంక్ సాధించిన జడ్పిహెచ్ఎస్ వింజమూరు పదవ తరగతి విద్యార్థిని తేజస్విని లకు  ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో  ఎఫ్పిఎస్టి మండల కోఆర్డినేటర్స్ కె.కృష్ణారెడ్డి, ఎస్. నారాయణ, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎం.అనంతరెడ్డి, విడియాల శ్రీనివాస్, మల్లేశ్వరీ, సంధ్యారాణి, కె.జగ్రామ్, అమీర్ అలీ, ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.

Tags: