ఘనంగా స్వపరిపాలన దినోత్సవం 

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం 

విశ్వంభర, ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం కోరటికల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తేది: 02.03.2026  సోమవారం రోజున పాఠశాలలో నిర్వహించిన  స్వపరిపాలన దినోత్సవములో  ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక సర్పంచ్ కట్టేకోల సుశీల హనుమంత్ గౌడ్. వారు మాట్లాడుతూ  ఒక్క రోజు అధికారులుగా ప్రజా ప్రతినిధులుగా ఉపాధ్యాయులుగా వేషధారణ చేసిన విద్యార్థులు నిజ జీవితంలో కూడా ఇలాంటి ఉన్నత స్థానాలలో స్థిర పడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వె కటరామిరెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సిహెచ్ ఎల్లమ్మ, గ్రామ పెద్దలు  హనుమంత్ గౌడ్ , బుడిగే వెంకటయ్య గౌడ్, ఉపాధ్యాయులు వెంకన్న, స్వామి, రవి, వరప్రసాద్ ,శ్రీనివాస్ చారి, అనురాధ,వెంకటేశంలు పాల్గొన్నారు.

Tags: