పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

విశ్వంభర, సిద్దిపేట: రూరల్ మండలం రాఘవాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ లో 2001-2002 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. నాడు చదువు చెప్పిన గురువులను సత్కరించారు. 25ఏండ్ల తర్వాత అందరూ ఒకచోట కలిసి స్కూల్ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఒక్కొక్కరు తమ జీవితంలోని సుఖసంతోషాలను పంచుకున్నారు. విద్యార్థి దశలో చేసిన అల్లరి పనులు, గురుశిష్యుల సంబంధ బాంధవ్యాలను గుర్తు చేసుకున్నారు. కేరింతలు, ఆటాపాటలతో రోజంతా సందడిగా గడిపారు.

Tags: