ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం 

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం 

విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాలలో  జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  ఘనంగా సైన్సు దినోత్సవ సంబరాలు జరిగాయి . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్ఐటి వరంగల్  రిటైర్డ్ ప్రొఫెసర్ కె లక్ష్మారెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు . ఈ  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి  ముఖ్య అతిథి హాజరైన  తెలంగాణ రాష్ట్ర సీనియర్ జనవిజ్ఞాన వేదిక నాయకులు కే . లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పిల్లలలో సైన్స్, జీవితంలో సైన్స్ ఆవశ్యకత గురించి ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు . మరియు  పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు చదువు లేకున్నా, మన ప్రాధమిక అవసరాలు తీరుతాయని, జంతువులు , పక్షులు కూడా మనతోనే జీవిస్తున్నాయని, జీవన శైలిలో తేడాలు గమనించి, మన జీవితం, అర్థవంతమైన జీవితం కావాలంటే చదువు ఒకటే మార్గమని, ఆ చదువు ద్వారా అందించిన సైన్స్ ఫలాలు మనందరం అనుభవిస్తున్నామని గుర్తుచేశారు. సి.వి రామన్ జీవిత చరిత్ర, మేరీ క్యూరి జీవిత చరిత్ర, వారు నోబెల్ బహుమతులు సాధించిన అంశాలను పిల్లలకు ప్రేరేపించే విధంగా వివరించారు. ఐన్ స్టీన్ అందించిన సైన్స్ ఫలాలు, భ్రూణో హత్య ఉదంతంతో సైన్స్ ఫలాలు సరిగా వాడుకోకపోతే జరిగే నష్టాలు వివరించారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక  జిల్లా అధ్యక్షులు సాహితీ శ్రీనివాస్, బి . సంధ్యారాణి , ఉపాధ్యాయులు పి. ఆంజనేయులు, పి. రాజేంద్ర ప్రసాద్, ఇ. ఉప్పలయ్య, జి. వెంకటనారాయణ, జె. శ్రీనివాస్,  తదితరులు,  విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: