ఘనంగా కొత్తపాటి సతీష్ జన్మదిన వేడుకలు 

ఘనంగా కొత్తపాటి సతీష్ జన్మదిన వేడుకలు 

విశ్వంభర, చండూర్:- బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు ఆయన కార్యాలయం వద్ద  మాజీ ఎంపీపి, బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు తోకల వెంకన్న పాల్గొని శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు  తేలుకుంట్ల జానయ్య, తేలుకుంట్ల చంద్రశేఖర్ పాల్గొని శాలువా తో  సత్కరించి, కేక్ కట్ చేయించి బాణ సంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్బంగా కొత్తపాటి సతీష్ మాట్లాడుతూ నా జన్మదినాన్ని పురస్కరించుకొని నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో జగన్, జగదీశ్, మోహన్,యాదగిరి, బీ ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Tags: