చేనేత జౌళి శాఖ కమీషనర్  శైలజా రామయ్యర్ కు రాపోలు ఎక్స్ లో పోస్ట్ 

చేనేత జౌళి శాఖ కమీషనర్  శైలజా రామయ్యర్ కు రాపోలు ఎక్స్ లో పోస్ట్ 

విశ్వంభర, హైదరాబాద్:- యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు బడుగు యాదగిరి తండ్రి సత్తయ్య గత మూడు మాసాల క్రితం అనారోగ్య కారణాల వలన మరణించాడు.అతడు చేనేత వృత్తిలో జీవనం సాగిస్తూ ఉండేవారు.....అతనికి యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత జౌళి శాఖ అధికారులు జియో టాగ్ విధానం లో ఉన్నట్లు ధ్రువీకరించారు.వారి ఆర్థిక స్థితిగతులు చాలా దుర్భరంగా ఉన్నాయనీ,ప్రభుత్వం నుండి వారికి అందాల్సిన నేతన్న భీమా పధకం నేటికీ అందలేదనీ అన్నారు.  అధికారుల దృష్టికి తీసుకువెళ్తే మీ జియోటాగ్ పరిగణలో లేదని చెబుతున్నారు. వారి కుటుంబానికి అందాల్సిన 5 లక్షల నేతన్న భీమా పాలసీ అందకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన నేతన్న భీమా పధకం  క్షేత్ర స్థాయిలో జియో టాగ్ నెంబరింగ్ ఉన్నప్పటికీ అధికారులు అనేక సాంకేతిక లోపాలు ఉన్నాయని చెబుతూ పథకాలు రాకుండా చేనేత కార్మికులకు నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారనీ దుయ్యాబట్టారు. 56 సంవత్సరాల వయస్సు ఉన్న బడుగు యాదగిరి  చేనేత వృత్తిలో ఉండి అకాల మరణంతో  ఆ కుటుంబం నేడు బజారున పడ్డదనీ, అప్పుల పాలై ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలవాల్సిన సమయం లో అధికారుల నిర్లక్ష్య వైఖరి వలన ఈ కుటుంబానికి రావలసిన నేతన్న భీమా నిలిచిపోయింది.  తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పక్షాన ఈ విషయం మీ దృష్టికి తెస్తున్నాను అంటూ హ్యాండ్లూమ్ కమీషనర్ శైలజ రామయ్యర్ కు ఎక్స్ ద్వారా తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ సందేశం పంపారు. ఈ విషయం మీద దృష్టి సారించి వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత జౌళి శాఖ అధికారుల తో మాట్లాడి ఆ కుటుంబానికి చేయూత అందించి న్యాయం చేయాలి అని కోరారు.

Tags: