15న కార్పొరేటర్లకు సన్మానం
On
విశ్వంభర, రామన్నపేట: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన కార్పొరేటర్లు, చైర్మన్, వైస్-చైర్మన్, మేయర్ లకు మార్చి 15న హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న గీతకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలానికి చెందిన కప్పల (పరిటాల) రవి తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమానికి హాజరు కావాలని భువనగిరి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ తక్కెళ్ళపల్లి వాణి రవికుమార్ ను మున్సిపల్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో బండారి విశ్వనాథం, సాల్వేరు బాలరాజు, బెల్లంకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.



