వ్యాయామంతో ఆత్మవిశ్వాసం : ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

వ్యాయామంతో ఆత్మవిశ్వాసం : ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

విశ్వంభర, అంబర్ పేట  : శారీరకంగా దృఢంగా ఉండడమే విజయానికి తొలి మెట్టు అని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు.
బాగ్ అంబర్పేట పోచమ్మ బస్తీలో కుంకుమ సురేందర్ కు  చెందిన యువ ఫిట్నెస్ ప్రో జిమ్ ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,  జిమ్ లో వ్యాయామం చేయడం వల్ల శరీర దారుఢ్యం పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని పేర్కొన్నారు. నిత్యం వ్యాయామం చేస్తే రోగనిరోధక శక్తి పెరిగి, ఒత్తిడి తగ్గుతుందని, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ అలవడతాయని చెప్పారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలు, జిమ్‌లాంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాల వైపు మళ్లాలని సూచించారు. ఆరోగ్యవంతమైన యువతే దేశాన్ని ముందుకు నడిపిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం జిమ్ నిర్వాహకులు కుంకుమ నరేందర్,  శివానంద్ , సురేందర్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు  పద్మ వెంకటరెడ్డి, అమృత , విజయకుమార్ గౌడ్, కన్నె ఉమా రమేష్ యాదవ్ , మాజీ కార్పొరేటర్ పద్మావతి రెడ్డి  వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Tags: