కూచిపూడి నాట్యంలో ప్రపంచ రికార్డు
On
విశ్వంభర, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కూచిపూడి నాట్య కళాకారిణులు రెండు ప్రపంచ రికార్డులు సృష్టించారు. జోగిపేటకు చెందిన అనుపమ బృందం ఈ ప్రత్యేక నాట్య ప్రదర్శనలో పాల్గొని ప్రతిభను చాటింది. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు చేసుకున్న ఈ ప్రదర్శనను స్ఫూర్తి డాన్స్ అకాడమీ నాట్య గురువు గీత యజ్ఞశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మార్చి 2న, సంగారెడ్డి లోని తార డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో 200 మందితో కూడిన నాట్య ప్రదర్శన జరిగినది. ఈ కార్యక్రమంలో జోగిపేట ప్రాంతంలోని చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.



