ఘనంగా ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే 

ఘనంగా ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే 

విశ్వంభర, బాగ్‌లింగంపల్లి : హిమాయత్‌నగర్‌లోని గౌతమ్ మోడల్ స్కూల్ ప్రీ–ప్రైమరీ గ్రాడ్యుయేషన్ వేడుక బుధవారం హైదరాబాదు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. “ప్రీ–ప్రైమరీ దశలోనే పిల్లలకు మంచి విలువలు, ప్రాథమిక విద్యను అందించడం ఎంతో ముఖ్యమని, భవిష్యత్తు విద్యాభ్యాసానికి ఇది బలమైన పునాది అవుతుంది” అని స్కూల్ ప్రిన్సిపల్ సునీతా దేవి తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్కూల్ డీన్ మధు కుమార్, ప్రీ–ప్రైమరీ ఇన్‌చార్జి పద్మ, హైస్కూల్ ఇన్‌చార్జి సంగీత పాల్గొన్నారు. ఉపాధ్యాయులు రాజేశ్వరి, కృషిత, కళ్యాణి, ప్రియాంక, త్రివేణి, కీర్తన్ కుమార్, కళ్యాణ్ రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.

Tags: