చిన్నారిపై వీధి కుక్క దాడి 

చిన్నారిపై వీధి కుక్క దాడి 

విశ్వంభర, శంకర్ పల్లి : మున్సిపల్ పరిధిలోని రెండో వార్డ్ లో  వీధి కుక్క ఒక చిన్నారి పై దాడి చేసింది.  దాడిలో చిన్నారికి  గాయాలయ్యాయి.  చిన్నారి హాస్పిటల్లో చికిత్స అందుతుంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శంకర్పల్లి వీధుల్లో వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయని పిల్లలను బయటికి రావడానికి భయపడుతున్నారని ప్రజలు చెప్తున్నారు. వీటిపై మున్సిపల్ అధికారులను వెంటనే స్పందించి వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని, వాటిని మున్సిపల్ పరిధి నుంచి తరలించే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే జంతు ప్రేమికులు కూడా ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టి ప్రజల భద్రత పట్ల జంతువుల సంరక్షణ సరైన చర్యలు తీసుకోవాలనీ కోరుతున్నారు.

Tags: