ఘనంగా స్వపరిపాలన దినోత్సవం  

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం  

విశ్వంభర, రామన్నపేట : యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, కొమ్మాయిగూడెం గ్రామం  లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రోజు స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులుగా ఎర్ర జ్యోతిబస్, జిల్లా విద్యాశాఖ అధికారిగా బుర్ర భరత్, ఎంఈఓగా సనావర్, జిల్లా కలెక్టర్ గా బాతుక మల్లేష్ వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీధర్, సఫియా బేగం, కోట విజయ వెంకన్న, మందడి శ్రీనివాస్ రెడ్డి, బండ బాలరాజ్, గడ్డం శ్రీనివాస్, శ్రీనివాసాచారి, సమ్రీన్ పాల్గొనడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులు తమ అభిప్రాయాలను తను జీవితంలో సాధించాల్సిన లక్ష్యాల్ని వివరించడం జరిగింది. ఇది విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపే కార్యక్రమంగా ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.

Tags: