ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
On
విశ్వంభర, మహబూబాబాద్: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ప్రజల రక్షణ,రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు మరియు ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా ఉండాలని తెలిపారు. రెండు చక్రాల వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోవాలని పోలీసులు సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి గారు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్ కుమార్, టౌన్ ఎస్ఐ షాకీర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు



