ట్రైనింగ్ తో విధులు తెలిశాయి 

ట్రైనింగ్ తో విధులు తెలిశాయి 

విశ్వంభర,నెల్లికుదురు: ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా విధులు, పవర్స్ తో పాటు పాలన పట్ల మరింత అవగాహన పెరిగిందని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాస్య తండా సర్పంచి బోడ నరసింహ నాయక్ అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి సంస్థ సౌజన్యంతో మండలంలోని 31 గ్రామాల సర్పంచ్ లకు జిల్లా కేంద్రం మహబూబాబాద్ లోని ఏకశిలా స్కూల్లో ఈనెల 25 నుంచి నిర్వహించిన శిక్షణ సోమవారం ముగిసింది. సందర్భంగా సర్పంచ్ నరసింహ మాట్లాడుతూ, 2018 పంచాయతీ రాజ్ చట్టం పై పూర్తి సబ్జెక్టు వివరించారన్నారు. గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి కావలసిన సమాచారం సవివరంగా తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఈజీఎస్,మహిళా  సఘాలు,సాధికారత తో పాటు పాలనాపరమైన ఎన్నో అంశాలను శిక్షణలో తెలుసుకున్నామన్నారు. దీంతో సర్పంచ్ ల అధికారాలు విధులు ఆసాంతం బోధపడిందని వివరించారు. నెల్లికుదురు ఎంపీడీవో సింగారపు కుమార్ ప్లాస్టిక్ పై బోధించిన సందేశాత్మక అంశం ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు గుగులోతు అశోక్, బండి శ్రీనివాస్,రామ్ సింగ్,నాయిని పద్మ, గుగులోతు సోమన్న తదితరులు పాల్గొన్నారు.

Tags: