సేంద్రీయ ఎరువులు వాడి అధిక దిగుబడులు పొందండి

విశ్వంభర, హనుమకొండ: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), మామునూర్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. అరుణ్ జ్యోతి హాజరై మాట్లాడుతూ, రైతు కుటుంబాల పోషకాహార భద్రత, మహిళల పాత్ర, వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. అనంతరం సేద్య విభాగ శాస్త్రవేత్త  డా. సీహెచ్. సౌమ్య  మాట్లాడుతూ,  రైతులు నేల పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువులను వినియోగించాలని సూచించారు. పంటల అవసరాలకు అనుగుణంగా నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు సూక్ష్మ పోషకాలను సరైన మోతాదులో వినియోగించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అలాగే పంటల సంరక్షణ, సమగ్ర పురుగుల యాజమాన్యం, నేల ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతుల అనుసరణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు, మహిళలు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/get-higher-yields-by-using-organic-fertilizers/article-16544

Tags: