క్రైస్తవ కమ్యూనిటీ కి కేటాయించిన స్థలంపై పునః పరిశీలన
విశ్వంభర, మహబూబాబాద్ :మహబూబాబాద్ పట్టణ క్రైస్తవుల సుదీర్ఘకాల డిమాండ్ అయిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మరో కీలక అడుగు పడింది. గతంలో క్రైస్తవ కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన భూమిని గురువారం రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పునః పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా భూమి కేటాయింపు జరిగినప్పటికీ ఆ స్థలం అధికారికంగా అందుబాటులోకి రాకపోవడంతో క్రైస్తవ సంఘాల నాయకులు పలుమార్లు ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఇటీవల మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ ను కలిసి తమ సమస్యను వివరించి వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కె. అనిల్ కుమార్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. దీంతో మహబూబాబాద్ మండల పరిధిలోని హైమా గార్డెన్స్ వెనుక సర్వే నంబర్ 551/1లో ఉన్న 1.20 ఎకరాల భూమిని అధికారులు పరిశీలించారు. మహబూబాబాద్ మండల తహసీల్దార్ చంద్ర రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఆర్ఐ ప్రవీణ్, మండల సర్వేయర్ లక్ష్మణ్ నాయక్ స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. భూమి హద్దులు, రికార్డులు, కేటాయింపుకు సంబంధించిన అంశాలను పరిశీలించి వివరాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సంఘాల నాయకులు తమకు ఎదురైన ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నో సంవత్సరాలుగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ చంద్ర రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే భూమి అప్పగింత ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం ద్వారా సామాజిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ పరిశీలన కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ నర్ర సంధ్య శ్రావణ్, క్రైస్తవ సంఘాల నాయకులు జన్ను మహేందర్, చాగంటి కరుణాకర్ తో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఏళ్ల తరబడి కొనసాగిన నిరీక్షణకు ముగింపు పలుకుతూ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మార్గం సుగమం కావడంపై క్రైస్తవ సంఘాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.