ఆకన్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

ఆకన్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

విశ్వంభర, మహేశ్వరం:  మహేశ్వరం మండల పరిధిలోని ఆకన్ పల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా లబ్ధిదారురాలు కాట్రవత్ రోజా కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేసి, కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకున్నారు,ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కాట్రవత్ జ్యోతి, ఉప సర్పంచ్ పులిజాల కవిత ప్రధానంగా హాజరై, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేదలకు ఇళ్లు కల్పించడం గొప్ప విషయమని తెలిపారు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ప్రణాళిక వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు స్థిర నివాసం కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు,అదేవిధంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో సహకారం అందించాలని సూచించారు,ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై, కొత్త ఇంటి గృహప్రవేశాన్ని ఆనందంగా జరుపుకున్నారు, ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ జీవన ప్రమాణాలనుమెరుగుపరుస్తాయని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాట్రావత్  జ్యోతి, ఉపసర్పంచ్ పులిజాల కవిత , మార్కెట్ కమిటీ డైరెక్టర్ అవాజి గారు వెంకట్ రెడ్డి, ఇందిరమ్మ   కమిటీ సభ్యులు బోలెపాక సంజీవ, కాట్రవత్ ప్రభు,  కావలి రమేష్, కాట్రవత్ చిట్టి బాయ్, బోలెపాక బాలమణి, గ్రామ శాఖ అధ్యక్షుడు ముక్కెర   కృష్ణయ్య, మహిళా సంఘం అధ్యక్షురాలు కమలమ్మ, పార్టీ నాయకులు కాట్రావత్ రవీందర్, చాకలి లక్ష్మణ్, రాము, శివ, శ్రీనివాస్, వెంకటేష్, రాములు, నరసింహ, పులేందర్, గoధ్య, విజేందర్, తదితరులు పాల్గొన్నారు,

Tags: