మానవ తప్పిదాలవల్లే   రోడ్డు ప్రమాదాలు

మానవ తప్పిదాలవల్లే   రోడ్డు ప్రమాదాలు

  • ఎస్పీ నరసింహ

విశ్వంభర, సూర్యాపేట: అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణం లో గల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో  విద్యార్థులకు రోడ్డు భద్రత పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్యఅతిథిగా హాజరై రోడ్డు భద్రత నివారణ చర్యల గురించి మాట్లాడారు. జీవితంలో క్రమశిక్షణ ఉంటే ఉన్నత స్థానాలకు చేరుతారు., రోడ్డు పై క్రమశిక్షణ ఉంటే సురక్షితంగా గమ్యానికి చేరుతారు. విద్యార్థులు బాధ్యతగా ఉండాలి రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించడంలో, రోడ్డు ప్రమాదాలు నివారించడంలో విద్యార్థులు ఆదర్శంగా, ప్రచారకర్తలుగా ఉండాలి అన్నారు. మానవ తప్పిదాల వల్ల అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఏ ఒక్కరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోకూడదు అనేది పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు. ప్రయాణ సమయంలో ముందస్తు జాగ్రత్తలతో సురక్షిత గమ్యం సాధ్యం అవుతుంది అన్నారు, డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపవద్దు, మైనర్ డ్రైవింగ్ తో మీకు ఎదుటి వారికి ప్రమాదం సంభవిస్తుంది అన్నారు. రోడ్డుకు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఆల్ వేస్ రైట్ అని తెలిపినారు. మనం క్షేమంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలు సాధిస్తాం. రోడ్డు ప్రమాదాల్లో వికలాంగులు అయితే జీవితం వ్యర్థం అవుతుంది, లక్ష్యం ఆవిరౌతుంది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో వాహనం నడిపే వారు వెనక కూర్చుని ఉన్నవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలి, కార్లు పెద్ద వాహనాల్లో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలి అని కోరారు. మైనస్ డ్రైవింగ్ చేయడం వల్ల వాహనం నడిపేవారు ఇతరులు కూడా ప్రమాదంలో పడతారని అన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపకూడదని సూచించారు. అతివేగంగా వాహనాల నడపడం ప్రమాదం అన్నారు. ప్రతి వాహనానికి అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలని వాహనదారుడు లైసెన్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం లో  స్థానిక ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, కళాశాల ప్రిన్సిపల్ ముత్యాలరావు, కళాశాల సిబ్బంది శ్రీనివాస్, వెంకన్న, నాగరాజు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: