రోడ్డు నిబంధనలు పాటించాలి 

రోడ్డు నిబంధనలు పాటించాలి 

  • సాహితి హైస్కూల్‌లో అవగాహన సదస్సు

 విశ్వంభర, సూర్యాపేట: రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారానే సురక్షిత ప్రయాణం సాధ్యమని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం అన్నారు. జిల్లా కేంద్రంలో ఈరోజు చర్చ్ కాంపౌండ్ లో  సాహితి హైస్కూల్‌లో అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కారులో ప్రయాణించేటప్పుడు డ్రైవర్‌తో పాటు ముందు, వెనుక సీట్లలో కూర్చునే వారు కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, లేనిపక్షంలో జరిమానాలు తప్పవని హెచ్చరించారు.  ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్టే శ్రీరామరక్ష అని ప్రతి ఒక్కరూ  హెల్మెట్ ధరించాలని కోరారు. ఆర్‌టీఏ నిబంధనల మేరకు అనుమతి పొందిన నంబర్ ప్లేట్లనే వాడాలని అన్నారు.వాహనాలకు ఇల్లీగల్ మోడిఫికేషన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై అన్నారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే సామాజిక బాధ్యతగా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: