నిందితులను కఠినంగా శిక్షించాలి

నిందితులను కఠినంగా శిక్షించాలి

విశ్వంభర, సిద్దిపేట: బేబీ మౌనిక మృతికి కారణమైన దుండగులను పట్టుకొని చట్టపరంగా శిక్షించాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోయిని సదన్ మహారాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,  నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామ జాతరలో రజక కులానికి చెందిన కుటుంబంపై అగ్రకుల  వ్యక్తులు  అత్యంత పాశవికంగా  దాడి చేసి, రెండు నెలల పసికందును తొక్కి చంపిన ఘటన సభ్య సమాజానికే సిగ్గు చేటు అని మండిపడ్డారు. నిందితులను అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలన్నారు. ఇప్పటికైన సీఎం స్పందించి నిందితులకు శిక్ష పడేలా చూడాలని, లేనిచో ధర్మ సమాజ్ పార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Tags: