విద్యార్థులకు పరిగి ఎమ్మెల్యే ఆల్ ది బెస్ట్
On
విశ్వంభర, పరిగి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా విద్యార్థిని, విద్యార్థులకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలన్నారు. మీ బంగారు భవిష్యత్ కు ఈ పరీక్షలు పునాది లాంటివ ని చెప్పారు. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి వారి కలలను నిజం చేయాలని ఆకాంక్షించారు. మంచి ఉత్తీర్ణత సాధించి మ తల్లిదండ్రులకు, మీ అధ్యాపకులకు మంచి పేరు తీసుకరావాలన్నారు.



