బడ్జెట్ లో 20 శాతం కేటాయించాలి
విశ్వంభర, హైదరాబాద్ : ప్రభుత్వ విద్యకు నిధులు సరిపడా కేటాయించని కారణంగా సమాజంలో నూత అసమానతలకు ప్రభుత్వాలే కారనమవుతున్నాయని సి ఆర్ పి ఎఫ్ బండ్లగూడ మండల కన్వీనర్ కృష్ణ నాయక్ అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ కమ్యూనిటీ హాల్ ఇంజన్ బౌలి లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు సరిపడ నిధులు కేటాయించనందున విద్యా వ్యవస్థ ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నదని గుర్తించాలన్నారు. ఈ సంక్షోభం నుండి బయట పడడానికి తెలంగాణ విద్యా వ్యవస్థ దుస్థితిని గుర్తించి 2026-27 బడ్జెట్ లో విద్యకు 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంలో అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంవి ఫౌండేషన్ మండల ఇన్చార్జి సత్యనారాయణ, మండల సలహాదారుడు నర్సింగ్ రావు, సి ఆర్ పి ఎఫ్ మండల్ కో కన్వీనర్ సుభాన్ బాయ్. మండల్ కోకన్వీనర్ వెంకటేష్. బస్తి కన్వీనర్ వరలక్ష్మి మరియు స్థానిక నాయకులు శంకర్ నాయక్ శేఖర్ జంగయ్య యాదయ్య , తల్లుల సంఘం పద్మ ఎం.వి ఫౌండేషన్ కార్యకర్తలు వినోద్ సంగీత లక్ష్మి , స్డివైఎఫ్ఐ నాయకులు శ్రీను రాజేష్ నవీన్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.



