చిన్నారిని బలిగొన్నవారి పై చర్య తీసుకోవాలి 

విశ్వంభర, కోదాడ: పసిప్రాణాన్ని బలిగొన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామ రజక సంఘ నాయకులు గరిడేపల్లి రాము డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొమురెల్లి గ్రామంలో గణేష్ మౌనిక దంపతులకు జన్మించిన రెండు నెలల చిన్నారి అగ్రకుల నాయకుల ఆకృత్యాలకు  బలి అయిన సంఘటన విదితమే. ఈ విషయంపై రజక సంఘం నాయకుడు రాము మాట్లాడుతూ,  అగ్రవర్గ అహంకారంతో ఉన్న సదరు వ్యక్తులపై  చర్యలు తీసుకోవాలని  కోరారు.  కుల, వర్గాలను అడ్డం పెట్టుకొని రాజ్య పాలన సాగిస్తున్న వ్యక్తులను వెంటనే ప్రభుత్వ పరంగా శిక్షించి సదరు బాధిత కుటుంబానికి  న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags: