రూ. 67 లక్షల గంజాయి పట్టివేత
విశ్వంభర, హైదరాబాద్: ఒరిస్సా కలిమెల నుంచి హైదరాబాద్ కు కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని, ఆశిష్ ఆయిల్ ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం పట్టుకున్నారు. కారు నెంబర్ చూస్తేనో హర్యానా కానీ ఆ నెంబర్ రాంగ్ నెంబర్ గా ఉంది. ఇలాంటి జిమ్మిక్కులు చేస్తూ మారుతి కారులో గజ్జయిని, ఆశిష్ ఆయిల్ ని తరలి స్తున్న కారును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం ఎస్ఐ శ్రీ హరిరావు సిబ్బంది కలిసి పట్టుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న ఒక మారుతి కారును ఆపి తనిఖీ చేయగా దాని లో మొత్తం 101.2 కేజీల ఎండు గంజాయి, 2.7 kg ల హాషీష్ ఆయిల్ లభ్యమైంది. ఈ గంజాయి ని , 2.7 kg ల హాషీష్ ఆయిల్ ను మహమ్మద్ అస్లామ్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రం కలిమెల నుండి హైదరాబాద్ కు తరలిరిస్తు న్నారు. పట్టుబడిన 101.2 కేజీల ల గంజాయి,2.7 కేజీల హాషీష్ ఆయిల్ విలువ రూ.67 లక్షల 20 వేలుగా ఉంటుందని అంచనా వేశారు. ముద్దాయి ని వైరా ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించారు.



