విద్యార్థులకు హరీశ్ రావు ఆల్ ది బెస్ట్

విద్యార్థులకు హరీశ్ రావు ఆల్ ది బెస్ట్

విశ్వంభర, సిద్దిపేట : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా  విద్యార్థిని, విద్యార్థులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో  రాయాలని సూచించారు. కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలన్నారు. మీ  బంగారు భవిష్యత్ కు ఈ పరీక్షలు పునాది లాంటివని చెప్పారు. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి వారి కలలను నిజం చేయాలని ఆకాంక్షించారు. మంచి ఉత్తీర్ణత సాధించి మ  తల్లిదండ్రులకు, మీ అధ్యాపకులకు మంచి పేరు తీసుకరావాలన్నారు

Tags: