తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం చైర్మన్ నియామకం
On
విశ్వంభర, చేవెళ్ల: తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్‌గా, చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్‌గా యాలాల మహేశ్వర్ రెడ్డి ని నియమించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ కారులను ఐక్యం చేస్తూ, వారి ఆత్మగౌరవం, సంక్షేమం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. ఉద్యమ కారుల సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా పనిచేయాలని సూచించారు. ఈ నియామకం తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినట్లు వెల్లడించారు.



